AP: లక్షా 34 వేల మంది రైతులకు రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అనేక పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులకు ఆదుకున్నామని అన్నారు. ఆక్వా రైతులకు రూ.990 కోట్లు రాయితీ ఇచ్చామని చెప్పారు. రాయలసీమలో హార్టీకల్చర్ను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడ ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.