MDK: తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యపాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 110 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో అదనపు కలెక్టర్ నగేష్, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.