సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో శక్తి టీంలు మహిళలు, బాలికలకు ‘శక్తి’ యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆపదలో SOS బటన్ లేదా 112కు కాల్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని వివరించారు. సైబర్ మోసాలు, గృహహింస, వేధింపులపై హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేశారు.