JGL: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించాలని స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు, సభ్యులు శనివారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 50 ఏళ్లుగా రిజర్వేషన్ ప్రక్రియలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని బాధితులు గోడు వ్యక్తం చేశారు. ఎస్సీ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు ఉన్నారు.