HYD: మాదాపూర్ శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పర్యాటక రంగాన్ని కేవలం వినోదానికి పరిమితం చేయకుండా పెట్టుబడులు ఆకర్షించి, యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. PPP భాగస్వామ్యం, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు.