VZM: అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని సీఎంకు వినతిపత్రం సమర్పించారు. తన వినతిపై CM చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారన్నారు.