AKP: బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో శనివారం 14వ రోజుకు చేరాయి. బల్క్ డ్రగ్ పార్క్ తీసుకువచ్చి మా పొట్ట పొట్ట కొట్టవద్దని మత్స్యకారులు నినాదాలు చేశారు. హెట్రో డ్రగ్స్ కారణంగా తమ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏర్పాటు అయితే ఉపాధి పూర్తిగా కోల్పోతామన్నారు.