VZM: ప్రజా వినియోగ సేవలకు సంబంధించిన తగాదాలను శాశ్వత లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవిత తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బీమా, బ్యాంకింగ్, విద్య, రవాణా, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, ఆసుపత్రి వంటి సేవలకు సంబంధించిన తగాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు.