SKLM: శ్రీకాకుళం సారవకోట పోలీస్ స్టేషను పరిధిలో ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం టోల్ ప్లాజా, చెక్ పోస్టులు, పబ్లిక్ ప్రదేశాలలో పోలీస్ డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. గంజాయి, ఇతర నార్కోటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా, నిల్వ చేసిన కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.