GNTR: సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు, మోర్ఫ్ వీడియోలు పెడితే చర్యలు తప్పవని గుంటూరు సీఐడీ అధికారులు హెచ్చరించారు. CMపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గడ్డం శివప్రసాద్(36)ను అరెస్ట్ చేశారు. మోర్ఫ్ వీడియోల కేసులో కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి, వారికి ఆర్థిక ఫండింగ్ ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.