AP: టెక్నాలజీ ఎంత పెరిగినా దేవాలయాల పవిత్రత కాపాడాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో అనేక దేవాలయాల పవిత్రతను ధ్వంసం చేశారని ఆరోపించారు. దేశంలోనే అత్యుత్తమ మద్యం విధానం తెచ్చామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. సంక్షేమ పథకాల ఫలితాలు పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.