ATP: అనంతపురం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని గుర్రం జాషువా విగ్రహానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. గుర్రం జాషువా సాహిత్యం సమాజంలో సమానత్వం, న్యాయం, మానవ విలువలకు ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.