ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని కొండపేట వాగు వద్ద ఇవాళ అర్బన్ సీఐ సురేష్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందున, నీటి గుండాలు ఏర్పడుతున్నాయని పిల్లలు ఎవరు ఈతకు వెళ్ళరాదని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తమ పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు.