సిరిసిల్ల: నెంబర్ ప్లేట్ల మార్పుపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు. సిరిసిల్లలో ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. వాహనాలకు నంబర్ ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు.