GNTR: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా, ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ఆదివారం వడ్డిముక్కల గ్రామానికి చెందిన రైతు గ్రూపుకు కిసాన్ డ్రోన్ అందించారు. రూ. 9.80లక్షల విలువైన ఈ డ్రోన్‌కు ప్రభుత్వం 80% సబ్సిడీ అందించింది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని, ఖర్చు, సమయం ఆదా చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.