ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం- ముత్తగూడెం రహదారి ప్రమాదకరంగా ఉందని స్థానికులు తెలిపారు. ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతో రాత్రి వేళల్లో ప్రయాణించాలంటేనే తీవ్ర ఇబ్బందిగా ఉందని స్థానికులు చెప్పారు. ఆదివారం రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, మరమ్మత్తులు చేయిస్తామన్నారు.