KMM: ఏన్కూరు వ్యవసాయ నూతన కమిటీ ఛైర్మన్‌గా గుగులోతు లచ్చిరాం నాయక్ ఆదివారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి శ్రమిస్తానని అన్నారు. నూతన మార్కెట్ ఛైర్మన్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.