ప్రకాశం: మార్కాపురంలో మైనింగ్ ఏడీ విష్ణువర్ధన్ రావు పదవి విరమణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MLA కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విష్ణువర్ధన్రావు మైనింగ్ శాఖకు అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. అనంతరం విశ్రాంత జీవనం ప్రశాంతంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.