AP: Dy CM పవన్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో CM చంద్రబాబు HYDలోని పవన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పవన్ మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సలహా మేరకు నిన్న మంగళగిరి నుంచి HYDకు వచ్చారు.