CTR: ప్రముఖ పుణ్య క్షేత్రం బోయకొండ గంగమ్మ అమ్మవారికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా సతీసమేతంగా ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, దసరా మహోత్సవంలో భాగంగా అమ్మవారికి విశేష అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.