KMM: వైరా వ్యవసాయ మార్కెట్ లోని గిడ్డంగుల సంస్ధ గోడౌన్ లను ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న బియ్యం నాణ్యతను, నిల్వలను పరీశీలించారు. ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం సరిగ్గా ఉందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు.