SS: పెనుకొండ పట్టణం మడకశిర రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి టీడీపీ నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ.. నియోజకవరంలోని గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయాలని వారికి సూచించారు.