NLG: చిట్యాల పట్టణంలో జరిగే దసరా పండగ ఏర్పాట్లపై రేపు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో ముందస్తు సమావేశం నిర్వహించనున్నట్లు కుల వృత్తిదారులు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, కుల వృత్తి సంఘాల నాయకులు హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు.