NZB :ఎడపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు PHC సిబ్బంది రాజేశ్వర్ తెలిపారు. మెగా హెల్త్ క్యాంప్‌లో స్త్రీ వైద్య నిపుణులు, సైకియాట్రీ, జనరల్ మెడిసిన్, ENT, డెర్మటాలజీ, కంటి వైద్యంతో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొంటారని తెలిపారు. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజేశ్వర్ సూచించారు.