VZM: తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా సమితి అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ భగత్ సింగ్ చిత్ర పటానికి మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శంకరరావు, కంది సత్యన్నారాయణ మూర్తి, చంద్ర పాల్గొన్నారు.