W.G: వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం ఎగువ నుంచి సుమారు 6లక్షల క్యూసెక్యుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. దీంతో నరసాపురం వద్ద గోదావరి నిండుకుండలా మారింది. సఖినేటిపల్లి-నరసాపురం రేవుల్లో పంటు రాకపోకలు నిలిపి వేశారు. నీటి మట్టాలు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వలంధర్ రేవులో స్నానాలు నిలుపుదల చేశారు.