MBNR: ప్రజా ప్రభుత్వంలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గత మూడు నేలల్లోనే 270 మందికి రూ. 1 కోటి 70 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.