PDPL: సింగరేణి సంస్థ బొగ్గు గని ప్రమాదంలో మరణించిన కార్మికుల డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ ఒప్పందం విషయంలో AITUCపై ఆరోపణలు చేసిన HMS నాయకులు రియాజ్ అహ్మద్‌పై నాయకులు YV రావు మండిపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొదటి నుంచి AITUC కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తుందన్నారు. యూనియన్‌పై అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.