ఆసియా కప్ ఫైనల్లో భాగంగా భారత్, పాక్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 16.1 ఓవర్లలో 133 పరుగులు చేసి ఏడో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్ల తాకిడికి పాక్ బ్యాటర్లు తట్టుకోలేకపోతున్నారు. కాగా, టీమిండియా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, అక్సర్, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీశారు.