TG: హైదరాబాద్‌లోని N-కన్వెన్షన్ కూల్చివేత అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. ఆగర్భ శ్రీమంతుడైన హీరో నాగార్జున గతంలో కొన్ని పరిచయాల వల్ల N-కన్వెన్షన్‌ను నిర్మించారని, ఆ తర్వాత ఆయనే ప్రభుత్వానికి రెండు ఎకరాల స్థలాన్ని తిరిగి ఇచ్చారని సీఎం తెలిపారు. నగరంలో చాలా మంది మోసగాళ్లు ఉన్నారని, వారి మాటలు విని ప్రభుత్వ భూములను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.