కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశేష కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలో గత రెండు రోజులుగా ఉపాధి కార్యాలయంలో జరిగిన ఉద్యోగ మేళాలో పలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 60 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం వారికి నియామక పత్రాలు అందజేశారు.