TG: రాజకీయాలకు అతీతంగా అంబర్పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. అంబర్పేట ప్రజలకు కావాల్సిన అవసరాల జాబితాను తయారు చేసి, ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. డిసెంబర్ 9వ తేదీలోపు అన్ని ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి, నిధులు కేటాయించే బాధ్యత తనదని సీఎం హామీ ఇచ్చారు.