NZB: జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా గత ఐదు రోజుల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో ఠాణా పరిధిలో ఒక ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.