SS: ధర్మవరంలోని NGO హోమ్ వద్ద నిర్వహించిన ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని అభివృద్ధి చేస్తాయని అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం అవసరమన్నారు.