WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మాదన్నపేట గ్రామంలోని లోలెవల్ బ్రిడ్జి వద్ద ఆదివారం రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మాదన్నపేట చెరువు నిండి, వరద ప్రవాహం వంతెన మీదుగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నర్సంపేట, మాదన్నపేట మధ్య వాహనాల రాకపోకలు స్తంభించి, పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.