VSP: గంజాయి స్మగ్లింగ్ కేసులో గతంలో అనేక నేర చరిత్ర ఉన్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను విశాఖలోని మహారాణిపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ దివాకర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పృథ్వీరాజ్, గొమంగి నాని బాబు, లోచలి కుమార స్వామిలు కలిసి గంజాయి సరఫరా చేస్తున్నారు.