NLG: త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లిలో మతసామరస్యం వెళ్లి విరిసింది. దేవీ నవరాత్రుల సందర్భంగా భవాని మాలలు ధరించిన స్వాములకు గ్రామ ముస్లింలు ఇవాళ శివాలయంలో అన్నదాన నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో యూసుఫ్, బాబా, సాబీర్, ఖాసిం, ఇనాయత్ తదితరులు పాల్గొన్నారు.