VSP: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అసోసియేట్ అధ్యక్షుడిగా విశాఖ జిల్లా పరవాడ మండలం, భర్నికం గ్రామ రెవెన్యూ అధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అమరావతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు పలువురు అభినందించారు.