ADB: తెలంగాణ నయాగారగా పేరొందిన కుంటాల జలపాతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతోంది. ప్రకృతి అందాల నడుమ పాల నురుగులా నీరు జాలువారుతుండటంతో పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. దసరా సెలవుల కారణంగా వాటర్ ఫాల్స్ చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది.