NLG: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కట్టంగూర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో ఆదివారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత ఏడు రోజులుగా అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.