KRNL: ప్రభుత్వం ఉద్యోగులకు వెంటనే ఐ.ఆర్‌ను ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణానిధి మూర్తి డిమాండ్ చేశారు. కర్నూలులోని పీఆర్టీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పాత బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.