MDK: మెదక్ పట్టణానికి చెందిన తారక సమత ఈ రోజు విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం పొందారు. గ్రూప్-4 ఫలితాల్లో 82వ ర్యాంకు సాధించి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొంది, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఫలితాల్లో 234 ర్యాంకు సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం పొందారు.