SS: ధర్మవరం NTR సర్కిల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ప్రధాని మోదీ జీవన ప్రయాణాన్ని ప్రతిబింబించే అరుదైన చిత్రాలు, ఆయన నాయకత్వంలో అమలు చేయబడిన వివిధ సంక్షేమ పథకాలను ప్రతిబింబించే చిత్రాలను ప్రదర్శించారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి భారతీయునికి ప్రేరణ ఇస్తుందని మంత్రి తెలిపారు.