NTR: అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ గాంధీ హిల్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) గాంధీ హిల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కేపీసీ గాంధీ, వైస్ ఛైర్మన్ జంధ్యాల శంకర్ కలిసి పర్యవేక్షించారు. పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయని వారు తెలిపారు.