GNTR: తెనాలి స్మశాన వాటికలో ఎటువంటి మృతదేహం లేకుండా కొన్నేళ్లుగా డమ్మీ సమాధి నిర్మించారని ఇదే ప్రాంతానికి చెందిన గడ్డేటి ప్రకాష్ బాబు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సీఐ రాములు నాయక్ ను కలిసి 2015లో డమ్మీ సమాధిని నిర్మించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు. సమాధిని ముందుగానే నిర్మించి స్థలాన్ని కబ్జా చేశారన్నారు.