KMR : గాంధారి మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఒక గొర్రె మరణించింది, దీని విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించగా, వారు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనతో స్థానిక కాపరులు భయాందోళనకు గురయ్యారు.