ASR: సమాజ హితం కోసం గుర్రం జాషువా ఎన్నో రచనలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి, రాష్ట్ర కార్యదర్శి పావని, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గోపాలపాత్రుడు అన్నారు. ఆయన సాహిత్యం నేటి యువతరం చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆదివారం హుకుంపేట మండలం మఠం గ్రామంలో గుర్రం జాషువా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.