MDK: చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన అల్లి విజయసేనారెడ్డి ఈరోజు విడుదల చేసిన గ్రూప్ -2 ఉద్యోగ ఫలితాల్లో ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం పొందారు. గ్రూప్-2లో 259 ర్యాంకు సాధించిన విజయసేనారెడ్డి ఎంఎస్సి పూర్తి చేసి మక్కరాజుపేట పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.