WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు వరుసగా 6 రోజుల సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. సోమవారం సద్దుల బతుకమ్మ, మంగళవారం వారాంత సెలవు, బుధవారం మహర్నవమి, గురువారం దసరా, గాంధీ జయంతి, శుక్ర, శనివారాలు వ్యాపారస్తుల కోరిక మేరకు సెలవులు ఇచ్చామని, అక్టోబర్ 5 నుంచి మార్కెట్ పునఃప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.