ADB: పువ్వులను పూజించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్యఅతిథిగా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానికులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, తదితరులున్నారు.